దసరా సెలవులు వచ్చాయి.. బస్టాండ్లు నిండాయి!

దసరా సెలవులు వచ్చాయి..  బస్టాండ్లు నిండాయి!

నేటి నుంచి అక్టోబర్​ 3వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన బస్టాండ్లు స్టూడెంట్స్​తో కిక్కిరిసిపోయాయి. గురుకులాలు, ప్రైవేట్ రెసిడెన్షియల్ లో చదువుకుంటున్న విద్యార్థులను శనివారం స్కూల్​ ముగియగానే తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు.

 బస్టాండుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పిల్లల్ని, లగేజ్ తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు. బస్సులు బస్టాండ్​కు వచ్చిన వెంటనే ప్రయాణికులతో నిండిపోయాయి. సీట్ల కోసం బస్సు కిటికిల్లోనుంచి బ్యాగులు, పిల్లలను ఎక్కించడం కనిపించింది. - ఖమ్మం ఫొటోగ్రాఫర్, వెలుగు