ఇంకో రావణుడు వచ్చాడు.. దహనం చేస్తాం

ఇంకో రావణుడు వచ్చాడు.. దహనం చేస్తాం
  • మున్ముందు ద్రోహులకు ఏం జరగబోతోందో అర్థమవుతోంది
  • నేను ఆస్పత్రిలో ఉంటే కట్టప్పలా మోసం చేసిండు: ఉద్ధవ్ థాకరే
  • ఉద్దవ్ థాకరే శివసైనికులను సొంత ప్రయోజనాలకు వాడుకుండు
  • ఉద్ధవ్ థాకరేకు నైతిక విలువలున్నాయా..? సీఎం ఏక్ నాథ్ షిండే

ముంబయి: దసరా వేడుకల సందర్భంగా మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.. మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే మధ్య మాటల యుద్ధం పతాక స్థాయిలో జరిగింది. పోటా పోటీగా కార్యక్రమాలను నిర్వహించారు. దాదర్ లోని  శివాజీ పార్క్ లో జరిగిన ఉత్సవాల్లో ఉద్ధవ్ కొడుకు, మాజీ మంత్రి ఆదిత్య థాకరేతో పాటు అనుచరులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఏక్ నాథ్ షిండేపై ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు చేశారు.

ఎప్పుడూ 10 తలల రావణుడిని దహనం చేస్తామనీ...కానీ ఇప్పుడున్న అతనికి ఎన్ని తలకాయలు ఉన్నాయని ప్రశ్నించారు. తాను హాస్పిటల్ లో ఉన్నప్పుడు కట్టప్పలాగా మోసం చేశాడంటూ.. షిండేపై ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. సీఎం ఏక్ నాథ్ షిండే కూడా తీవ్రంగానే స్పందించారు. శివ సైనికులను తన సొంత ప్రయోజనాలకు వాడుకున్న ఉద్ధవ్ థాకరేకు నైతిక విలువలు ఉన్నాయా..? అని సీఎం షిండే ప్రశ్నల వర్షం కురిపించారు.