అవీ-‌‌ – ఇవీ: పాన్​కేక్​ల పండుగ

అవీ-‌‌ – ఇవీ: పాన్​కేక్​ల పండుగ

బతుకమ్మ పండుగొస్తే పూలతో బతుకమ్మను తయారుచేస్తారు. దీపావళికి దీపాలు వెలిగిస్తారు. ఒక్కో పండుగ ఒక్కోలా చేసుకుంటారు. అలాగే పాన్​కేక్​ల పండుగొస్తే తలమీద పాన్​కేక్​లు పెట్టుకుంటారు! ఇదేం పండుగ? ఇలా ఎవరు చేసుకుంటారు? 

నెదర్లాండ్స్​లోని రోటెర్​డామ్​లో ప్రతి ఏటా నవంబర్ 29న ‘డచ్​ పాన్​కేక్ డే’ జరుగుతుంది. అలాగే ఈసారి కూడా నెదర్లాండ్ ప్రజలు ఎంతో సంతోషంగా ఆ డే సెలబ్రేట్​ చేసుకున్నారు. అందులో భాగంగా తలల మీద పాన్​కేక్​లు పెట్టుకుంటారు. ఇది దాదాపు 40 ఏండ్లుగా వస్తున్న ఆచారం. పాన్​కేక్​లను తలపై పెట్టకుని ‘సెయింట్ పాన్​కేక్ శుభాకాంక్షలు’ అని చెప్పుకుంటారు. 

ఇలా మొదలైంది

ఈ సెలబ్రేషన్స్1986లో మొదలైంది. డచ్​ కార్టూనిస్ట్​ జాన్​ క్రూయిజ్ దీనికి నాంది పలికాడు. సాయంకాలం తండ్రి కోసం ఎదురుచూస్తున్న ఒక ఫ్యామిలీ... తండ్రి ఇంటికి వచ్చేటప్పటికి తల మీద పాన్​కేక్​లు పెట్టుకుని ఉన్నట్టు ఒక కార్టూన్​ వేశాడు. ఆ కార్టూన్​ అర్ధం –  తమతో పాటు పాన్​కేక్​లు తినడానికి తండ్రికి ఇలా స్వాగతం చెప్పారన్నమాట. అయితే 30 ఏండ్ల తర్వాత ఈ ఐడియాని ‘ది గాస్పెల్​ ఆఫ్​ సెయింట్ పన్నెకోక్’​ పేరుతో ఒక కథగా మార్చి చెప్పాడు ఆ కార్టూనిస్ట్​. దాని గురించి మాట్లాడుతూ..  ‘కామిక్​ స్టోరీస్​లో చెప్పిన పండుగల్ని ఎవరూ జరుపుకుని ఉండరు. కానీ, దీన్ని మాత్రం30  ఏండ్లుగా చేస్తున్నారు. పైగా దీన్ని నేషనల్​ హాలిడేగా ప్రకటించారు కూడా. మొదట దీన్ని కొందరు స్టూడెంట్స్ ఫాలో అయ్యారు” అని గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.