పవన్ ఫ్యాన్స్కు నిరాశే.. నో ఫస్ట్ లుక్.. నో టీజర్

పవన్ ఫ్యాన్స్కు నిరాశే.. నో ఫస్ట్ లుక్.. నో టీజర్

పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. పాపం వాళ్ళ ఆశలపై నీళ్లు చెల్లేశారు మేకర్స్. దాదాపు 20 రోజుల నుండి సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(Pawan kalyan birthday) సంధర్బంగా ఓజీ(OG) మూవీ నుండి అప్డేట్ ఉంటుంది అంటూ ఫ్యాన్స్ కు ఆశలు రేకెత్తించారు. అంతెందుకు మొన్నటికి మొన్న కూడా పేల్తాయి.. అన్ని రికార్డ్స్ పేల్తాయి అంటూ మరో అప్డేట్ కూడా ఇచ్చాడు. 

దీంతో ఖచ్చితంగా ఆరోజు ఓజీ మూవీ నుండి టీజర్ రిలీజ్ చేస్తారని అనికున్నారు ఫ్యాన్స్. కానీ తాజాగా మరో అప్డేట్ ఇస్తూ ఆ ఆశలపై నీళ్ల చెల్లేశారు. డీవీవీ ఎంటెర్టైమెంట్స్ తన ట్విట్టర్ లో నో ఫస్ట్ లుక్ అంటూ మరో అప్డేట్ ను ఇచ్చారూ. ఇది చుసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతన్నారు. టీజర్ వస్తుంది.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయాలని ఎన్నో ప్లన్స్ వేసుకున్నారు. కానీ ఒక్క స్టేట్మెంట్ తో వాటన్నిటిని కిందకు తోసేశారు మేకర్స్. 

నిజానికి మేకర్స్ ముందు చెప్పినట్టుగానే సెప్టెంబర్ 2న అప్డేట్ ఇవ్వనున్నారు కానీ.. అది టీజర్ కాదు ఫస్ట్ లుక్ కాదు. ఓజీ మూవీ కి సంబంధించిన ఒక మ్యూజిక్ వీడియో అంతే. ఓజీ మూవీ అనౌన్స్మెంట్ టైం దర్శకుడు సుజీత్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు కాదా అలాంటి వీడియోనే ఇప్పుడు కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ వీడియో ఎలా ఉంటుంది. అందులో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా లేదా షూటింగ్ కు సంబంధించిన పిక్స్ రిలీజ్ చేస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలసిందే. 

ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మి, అర్జున్ దాస్ కీ రోల్స్ చేయనున్నారు. తమన్ సంగీతం ఆడిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.