
తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ఈ రోజు ( జులై 3) ఉదయం 11:30 గంటలకు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో .. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌ను కూడా విచారించారు. కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అరవింద్‌కుమార్‌ను అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. దాదాపు నెల రోజుల పాటు విదేశాల్లో ఉండి జూన్ 30న హైదరాబాద్‌కు అరవింద్ కుమార్ వచ్చారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ కార్ ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని.. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సంగతి విదితమే. అయితే, ఈ కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది.