రేషన్ కార్డు దారులకు అలర్ట్..ఇంకా నాలుగు రోజులే గడువు

రేషన్ కార్డు దారులకు అలర్ట్..ఇంకా నాలుగు రోజులే గడువు

నకిలీ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  ఈ కేవైసీ గడువు జనవరి 31తో ముగియబోతుంది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులంతా సమీప రేషన్ షాపుల్లో ఎక్కడైనా కేవైసీ చేసుకోవచ్చని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతుంది.  ఇంకా నాలుగు రోజులే సమయం ఉండటంతో కేవైసీ చేసుకోని వారు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లు, పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన ఆడపిల్లల పేర్లు అలానే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం 2023 సెప్టెంబర్  నుంచి ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టింది.  రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీ మెంబర్ల వేలిముద్రలు తీసుకుంటుంది.  దూరంగా...వేరే ప్రాంతాల్లో ఉన్న వారు దగ్గర్లోని రేషన్ షాపుల్లో తీసుకునే వెసులుబాటు ఇచ్చింది. 

జిల్లాల్లో కేవైసీ అప్ డేట్ ప్రక్రియ వేగంగా జరిగినా..హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు ఇంకా 30 శాతం మంది కేవైసీ  చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. కేవైసీ పూర్తి చేసుకోని వారికి  రేషన్ కట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది.