రూ. లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక: సీఎం రేవంత్‌రెడ్డి

రూ. లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక: సీఎం రేవంత్‌రెడ్డి

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రూ. లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికను అమలు చేయాలని కోరారు. లోక్‌సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్‌ ఛానెల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు చేపట్టాలని చెప్పారు. 

గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలం గుర్తించాలని.. గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. 

బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్స్ తో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.