తెలంగాణ‌కు వ‌చ్చేవారికి ఈ-పాస్ త‌ప్ప‌నిస‌రి

తెలంగాణ‌కు వ‌చ్చేవారికి ఈ-పాస్ త‌ప్ప‌నిస‌రి

సూర్యాపేట జిల్లా: ఆంధ్రా నుండి తెలంగాణ‌కు వ‌చ్చే వారికి ఈ- పాస్ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అని తెలిపారు పోలీసులు. శ‌నివారం ఆంధ్రా-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లను సూర్యాపేట‌ జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ ఐపీఎస్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆంధ్రా నుండి తెలంగాణకు వచ్చే వారికి ఈ-పాస్ అనుమతి తప్పనిసరి అన్నారు. ఇది లాక్ డౌన్ మినహాయింపు సమయం ఉ.6 గంటల నుండి ఉ.10 గంటల సమయంలో కూడా e-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తాం అన్నారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ లకు అనుమతులు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అలాగే మేల్లచెరువు, చితలపాలెం, మఠంపల్లి, పాలకవీడు మండలాల్లో ఉన్న ఆంధ్ర-తెలంగాణ   అంతరాష్ట్ర సరిహద్దుల్లో అత్యవసర సేవలు మినహాయించి , ఇతర అన్ని సాధారణ రాకపోకలను 24 గంటలు నిషేదించామ‌న్నారు.

కొంత మంది వాహనదారులు, ప్రజలు లాక్ డౌన్ మినహాయింపు సమయాన్ని ఆసరాగా చేసుకుని అనవసరంగా సరిహద్దులు దాటుతున్నారని తెలిపారు. అలాగే ఆంధ్రా నుండి ఎలాంటి అనుమతి లేకుండా ఉదయం 4 నుండి 6 గంటలోపు రామాపురం x రోడ్డు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ కు చేరుకుని అక్కడే 6 గంటల వరకు వేచి ఉండి మినహాయింపు సమయంలో తెలంగాణలోకి వస్తున్నారని తెలిపారు. ఈ కారణంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఆంక్షలను కఠినతరం చేశామని ఎస్పీ చెప్పారు. తెలంగాణాలోకి రావాలంటే ఎసమయంలోనైనా ఈ-పాస్ ఉండాలని తెలిపిని ఎస్పీ.. ఇది ప్రజలు గమనించి పోలీసుల‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.