
- శంషాబాద్ ఎయిర్పోర్టులో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈశ్రామ్ నమోదు కేంద్రం బుధవారం స్టార్ట్ అయింది. కేంద్ర ఉపాధి శాఖకు చెందిన దత్తో పంత్ తెంగడి నేషనల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్( డీటీఎన్ బీడబ్ల్యూఈడీ ), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫారమ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ)లు సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నిర్వహించనున్నారు.
ఈ కేంద్రంలో ఎయిర్ పోర్ట్ కు క్యాబ్ లు నడుపుతున్న డ్రైవర్లు తమ పేర్లను రిజిస్ర్టేషన్ చేసుకున్నట్లు టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, యాప్ ఆధారిత గిగ్ వర్కర్లు ఈ-శ్రామ్ పోర్టర్ లో తమ పేర్లు నమోదు చేసుకొని..సామాజిక భద్రతా ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు, కార్మిక రక్షణ పొందాలని సూచించారు.