హైదరాబాద్, వెలుగు: రైల్వే సిగ్నలింగ్, టెలికాం సిస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీస్లు అందిస్తున్న ఈ 2ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ 525 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఐపీఓకి వచ్చిన ఈ కంపెనీ, రూ.84.22 కోట్లు సేకరిం చింది. ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 26న ప్రారంభమైం ది. క్యూఐబీ పోర్షన్ 236.30 రెట్లు.. ఎన్ఐఐ పోర్టన్ 871.67 రెట్లు, రిటైల్ పోర్షన్ 541 రెట్లు సబ్స్కయిబ్ అయ్యింది.
ఈ2ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కో షేరును రూ.164-174 రేంజ్లో అమ్మకానికి ఉంచింది. ఐపీఓలో లాట్ సైజు 800 షేర్లు. అలా ట్మెంట్ బుధవారం (డిసెంబర్ 31న), లిస్టింగ్ జనవరి 2, 2026 న ఎన్ఎస్ఈ ఎస్ఎంఈలో ఉంటుంది. ఈ కంపెనీ కవచ్ 4.0 ప్రాజెక్టులు, మెట్రో సీబీటీసీ సిగ్నలింగ్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్. ఆధునికీకరణ పనులు చేపట్టింది.
