- రుగురికి పాజిటివ్
- ఈవెంట్ లో టాలీవుడ్, బాలీవుడ్ నటులు!
హైదరాబాద్, వెలుగు: రిసార్ట్స్ లో డ్రగ్స్ పార్టీలపై ఈగల్ ఫోర్స్ సోదాలు కొనసాగుతున్నాయి. గోల్కొండ తారామతి బారాదరిలోని ఓ రిసార్ట్ లో శనివారం రాత్రి ఈగల్ టీం సోదాలు చేసింది. రిసార్ట్ లో జాక్, జాన్సన్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో రాత్రి 11 గంటల సమయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. పార్టీలో పాల్గొన్న వారిలో అనుమనితులకు యూరిన్ డ్రగ్ కిట్ తో టెస్టులు చేసింది. ఇందులో ఆరుగురికి గంజాయి, డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు టెస్టులు కొనసాగాయి.
పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఈవెంట్ లో టాలీవుడ్, బాలీవుడ్ నటులు సహా పలువురు వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నట్లు తెలిసింది. యూరిన్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఈగల్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
