ఫీజులు ఖరారు కాకపోవడంతో ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా

ఫీజులు ఖరారు కాకపోవడంతో ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా

హైదరాబాద్, వెలుగు:  ఇంజినీరింగ్ కాలేజీల్లో  ఫీజుల పంచాతీ ఎంసెట్ అడ్మిషన్లపై పడింది. 2022–25  పీరియడ్ కు ఫీజులు ఇంకా ఖరారు కాకపోవడంతో అధికారులు ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా వేశారు. ఈ మేరకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ సోమవారం ప్రకటించారు.

ఫీజులపై నిర్ణయానికి  టైమ్​పట్టే అవకాశముండటంతో రెండువారాల పాటు ఎంసెట్ కౌన్సెలింగ్ ను వాయిదా వేశారు. అక్టోబర్11,12న రిజిస్ర్టేషన్ తో పాటు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు స్లాట్ బుకింగ్ ఉంటుందని తెలిపారు. 12న సర్టిఫికేట్ల వెరిఫికేషన్, 12,13 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 16న సీట్ల అలాట్-మెంట్ ఉంటుందన్నారు. కాగా, ఈ నెల 28(బుధవారం) నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.