బుర్ర ఉంటే.. సోషల్ మీడియాతో సంపాదన ఇలా.. 10 లక్షల మంది.. నెలకు 40 వేల చొప్పున..

బుర్ర ఉంటే..  సోషల్ మీడియాతో సంపాదన ఇలా.. 10 లక్షల మంది.. నెలకు 40 వేల చొప్పున..

ఏప్రిల్ 21వ తేదీన ఇంటర్నేషనల్ క్రియేటర్స్('అంతర్జాతీయ సృష్టికర్తల దినోత్సవం-  'International Creators Day'')  సందర్భంగా క్రియేటర్ ఎకానమీ స్టార్టప్ అనిమెటా ఓ నివేదిక వెల్లడించింది. గ్లోబల్ గ్రోత్ రేట్ 18 శాతంతో పోలిస్తే, వ్యక్తిగత సృష్టికర్తల (individual creators) కోసం భారతదేశ వార్షిక వృద్ధి రేటు 115 శాతానికి పైగా ఉందని తెలిపింది. వాటితో పాటు..

  • 10 లక్షల మంది భారతీయ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ వచ్చే మూడేళ్లలో ఒక్కొక్కరు నెలకు $500 (రూ. 41 వేల కంటే కొంచెం ఎక్కువ) సంపాదించే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.
  • మూడు సంవత్సరాలలో భారతదేశంలోని 10 లక్షల మంది క్రియేటర్‌లు కనీసం ఒక లక్ష మంది సబ్‌స్క్రైబర్‌లు/ఫాలోవర్లను కలిగి ఉంటారు. ఫలితంగా వార్షిక స్థాయిలో 37 శాతం వృద్ధిని సాధిస్తారు. దీని వల్ల ఉద్యోగంతో సమానంగా స్థిరమైన డిజిటల్ ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.
  • ప్రస్తుతం భారతదేశంలో 3 వేల కంటే ఎక్కువ బ్రాండ్ లు.. 5 వేల కంటే ఎక్కువ క్రియేటర్ పార్ట్ నర్స్ ఉన్నారు.
  • "రాబోయే రెండేళ్ళలో గ్లోబల్ క్రియేటర్ ఎకానమీ పెరిగేందుకు భారతీయ క్రియేటర్ ఎకానమీ అత్యంత ముఖ్యమైందనదిగా మారుతుందనే సంకేతాలు సూచిస్తున్నాయని మెటా CEO దేవదత్తా పోట్నిస్ అన్నారు.
  • సింగపూర్‌కు చెందిన Animeta వృద్ది చెందేందుకు డిజిటల్ క్రియేటర్‌లను సృష్టించడం, పెంపొందించడంపై దృష్టి పెట్టనుంది. దీని వల్ల ఆదాయం సముపార్జనకూ అవకాశమున్నట్టు ప్రణాళిక చేస్తోంది.