జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలో ధర్మకంచ జడ్పీహెచ్ఎస్ లో ఆదివారం ఎర్త్ ఫౌండేషన్ స్కిల్స్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం భూతాల వెన్నెల అధ్యక్షత నిర్వహించగా చీఫ్ గెస్ట్‌గా జనగామ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఏడాది పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నైపుణ్యాలు అభివృద్ధి చేయడం గొప్ప విషయమన్నారు.
ఫౌండేషన్ ఫౌండర్ కలవేణి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎర్త్ యాప్స్ అసోసియేట్స్ వారి సహకారంతో ఉన్నత పాఠశాలలో చదివే పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్, మొబైల్ సైన్స్‌ల్యాబ్, మోటివేషన్ క్లాసెస్ లాంటి సేవలు అందించినట్లు చెప్పారు. అనంతరం ఎర్త్ ఫౌండేషన్ గతేడాది దత్తత తీసుకున్న ఆరు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కబడ్డీ, సైన్స్ ఎక్స్ఫైర్మెంట్, స్పీచ్, ఎస్సే రైటింగ్ అంశాల పైన కాంపిటేషన్స్ ను ఘనంగా నిర్వహించి, గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
