జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ లో భూకంపం

జమ్మూకాశ్మీర్, రాజస్థాన్  లో భూకంపం

ఉత్తర భారతంలో వరుస  భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.   శనివారం తెల్లవారుజామున 1.29 గంటల సమయంలో రాజస్థాన్ లోని పాలి జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం తీవ్రత రిక్టర్  స్కేలుపై 5.4 గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం ప్రకటించింది.  పాలికి 15.8 కిమీ(10 మైళ్ళు) దూరంలో 10 కిమీ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పింది.

 జమ్మూకాశ్మీర్ లోనూ భూకంపం సంభవించింది. ఏప్రిల్ 5న శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ లో రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో భూ ప్రకంపం వచ్చినట్లు భూకంప అధ్యయన అధికారులు వెల్లడించారు.  భూకంపం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇండ్లు, దుకాణాలను వదిలి ప్రాణ రక్షణ కోసం బయటకు పరుగులు తీశారు.