చైనాలో భారీ భూకంపం..ఊగిపోయిన భవనాలు..పరుగులు తీసిన ప్రజలు

చైనాలో భారీ భూకంపం..ఊగిపోయిన భవనాలు..పరుగులు తీసిన ప్రజలు

చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఆగస్టు 06వ తేదీ ఆదివారం అర్థరాత్రి 2 గంటల 33 నిమిషాలకు షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో  భూమి కంపించింది.  రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదైంది. భూకంపంతో126 పైగా బిల్డింగ్ లు నేలమట్టం అయ్యాయి. భూ ప్రకంపనల ధాటికి భవనాలు ఊగిపోవడంతో  జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. భూకంపంలో పలువురు గాయపడ్డారు. 

రాజధాని బీజింగ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో  డెజౌ నగరానికి దక్షిణ ప్రాంతంలో 26 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపానికి సంబంధించిన కొన్ని వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

భూకంప తీవ్రతతో చైనా షాన్ డాంగ్ ప్రావిన్స్ లో రైళ్లు  ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లపై కూడా భూకంపం తీవ్ర ప్రభావం చూపింది.  ప్రమాదం కారణంగా గ్యాస్ సరఫరా నిలిచిపోయింది.పలు ప్రాంతాల్లో పైపులైన్లు దెబ్బతిన్నాయి.