మీ అంతర్గత సమస్యలపై ఫోకస్ పెట్టండి..పాకిస్తాన్​కు ఇండియా కౌంటర్

మీ అంతర్గత సమస్యలపై ఫోకస్ పెట్టండి..పాకిస్తాన్​కు  ఇండియా కౌంటర్

వాషింగ్టన్: కాశ్మీర్, ఢిల్లీలపై పనికిమాలిన ఆరోపణలను మానేసి పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలపై ఫోకస్ పెట్టాలని భారత్ సూచించింది. ఈ మేరకు గురువారం గ్లోబల్ ఫుడ్ ఇన్ సెక్యూరిటీ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓపెన్ డిబేట్ నిర్వహించింది. చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి కాశ్మీర్, ఢిల్లీ సమస్యలను ప్రస్తావించారు. దాంతో పాక్ ప్రతినిధిపై ఇండియా యూఎన్  కౌన్సెలర్ ఆర్. మధు సూదన్ ఫైర్ అయ్యారు. గ్లోబల్ ఫుడ్ ఇన్ సెక్యూరిటీ అంశానికి సంబంధంలేని విషయాల్ని మాట్లాడి పాక్ ఆఫీసర్లు భద్రతామండలి టైమ్ వేస్ట్ చేస్తున్నారని చురకలంటించారు. ప్రపంచ వేదికలపై చాన్స్ దొరికినప్పుడల్లా పాక్ ప్రతినిధులకు ఇండియాపై పనికిమాలిన ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు.