ఢిల్లీలో మరోసారి భూకంపం.. పరుగులు పెట్టిన జనం

ఢిల్లీలో మరోసారి భూకంపం.. పరుగులు పెట్టిన జనం

ఢిల్లీలో మరోసారి భూకంపం వచ్చింది.శుక్రవారం(జూలై11) ఢిల్లీ -ఎన్ సీఆర్ లో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో జనం ఇండ్లలోంచి బయటికి పరుగులు పెట్టారు. భూకంప హర్యానాలోని ఝజ్జర్ కేంద్రంగా 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ (NCS) తెలిపింది.   ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఈ వారంలో ఈ ప్రాంతాన్ని తాకిన రెండవ భూకంపం ఇది.

 గురువారం కూడా దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం జనానాలను భయభ్రాంతులకు గురి చేసింది.ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, భివానీ, ఝజ్జర్, బహదూర్‌గఢ్ సహా అనేక నగరాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. భూకంపం హర్యానాలోని ఝజ్జర్‌ కేంద్రంగా భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.1గా నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు. 

►ALSO READ | పాయింట్ బ్లాంక్‎లో కూతురి గుండెల్లోకి నాలుగు బుల్లెట్లు దించాడు