హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈజ్‌మైట్రిప్ మ్యాజిక్.. టికెట్‌తో పాటే ఫుడ్ ప్రీ-ఆర్డర్ సర్వీస్..

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈజ్‌మైట్రిప్ మ్యాజిక్.. టికెట్‌తో పాటే ఫుడ్ ప్రీ-ఆర్డర్ సర్వీస్..

విమాన ప్రయాణం అంటేనే ఒకప్పుడు లగ్జరీ.. కానీ ఇప్పుడు అది అవసరంగా మారింది. అయితే ఎయిర్ పోర్టుకు వెళ్లిన తర్వాత చెక్-ఇన్, సెక్యూరిటీ చెక్ ముగించుకున్న తర్వాత.. ఆకలి వేసినప్పుడు ఫుడ్ కోర్టుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడటం ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ 'ఈజ్‌మైట్రిప్' (EaseMyTrip) ఒక వినూత్నమైన సేవను ప్రారంభించింది.

విమాన టికెట్‌తో పాటే ఫుడ్ ఆర్డర్..
ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసే లక్ష్యంతో ఈజ్‌మైట్రిప్, ఫుడ్-టెక్ ప్లాట్‌ఫారమ్ 'హోయ్' (Hoi)తో జతకట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రయాణికులు తమ విమాన టికెట్లను బుక్ చేసుకునే సమయంలోనే తమకు నచ్చిన ఆహారాన్ని ముందస్తుగా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు న్యూఢిల్లీ, హైదరాబాద్, గోవా ఎయిర్ పోర్ట్స్‌లో అందుబాటులోకి వచ్చాయి.

ప్రయాణికులు ఈజ్‌మైట్రిప్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత.. వారు నేరుగా 'హోయ్' ప్లాట్‌ఫారమ్‌కు మళ్లించబడతారు. అక్కడ అందుబాటులో ఉన్న రకరకాల ఆహార పదార్థాల నుంచి తమకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. ప్రయాణికుల విమాన సమయానికి అనుగుణంగా ఫుడ్ సిద్ధంగా ఉండేలా ఈ సిస్టమ్ డిజైన్ చేయబడింది. దీనివల్ల విమానాశ్రయానికి చేరుకున్నాక ఫుడ్ కౌంటర్ల వద్ద వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఆహారాన్ని పికప్ చేసుకోవచ్చు.

విమానాశ్రయాల్లో గడిపే సమయం చిన్న చిన్న నిర్ణయాలతో ఒత్తిడికి చాలాసార్లు గురిచేస్తుందని ఈజ్‌మైట్రిప్ కో-ఫౌండర్, సీఈఓ రికాంత్ పిట్టి అన్నారు. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో తాము ఈ ఆలోచనతో వచ్చినట్లు చెప్పారు. హోయ్‌తో కలిసి అందిస్తున్న ఈ ప్రీ-ఆర్డర్ మీల్ సర్వీస్ ప్రయాణికులకు ఊరటనిస్తుందని అన్నారు. ఫుడ్ ఆర్డర్‌లను బుకింగ్ ప్రక్రియలో విలీనం చేయడం ద్వారా, ప్రయాణికులు ఒత్తిడి లేని, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.