తూర్పుగోదావరి జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. కొవ్వూరు హైవేపై షార్ట్ సర్కూట్‌తో బస్సు దగ్ధమైంది. RRR ట్రావెల్స్ కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. కొవ్వూరు గామన్ బ్రిడ్జి సమీపంలో ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళుతుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతో ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ప్రయాణికులకు సంబంధించిన లగేజ్‌లు మాత్రం బస్సులో ఉండిపోయినట్టు తెలుస్తోంది.
