
బరువు తగ్గడానికి డైటింగ్ ఎంత ముఖ్యమో.. ఎక్సర్సైజ్లు కూడా అంతే ముఖ్యం. ఈజీగా చేసే వామప్ ఎక్సర్సైజ్లు కొన్ని ఉన్నాయి. వీటిని ఐదు నిమిషాల్లో చేస్తే చాలు. బాడీ వామప్ అనేది మెటబాలిజం మీద మంచి ఇంపాక్ట్ చూపుతుంది. అందుకే.. బరువు తగ్గడానికి, మజిల్స్ బలపడటానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ ఎక్సర్సైజ్లు.
స్క్వాట్: బరువు తగ్గడానికి , మజిల్ పవర్ పెంచేందుకు ఇది బాగా పని చేస్తుంది. ఒకేటైంలో రెండు విధాలుగా ఉపయోగపడే కమాండ్ ఎక్సర్సైజ్ ఇది. ఐదు నిమిషాల్లో ఐదు సార్లు స్క్వాట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది. మధ్యలో 10 సెకన్ల రెస్ట్‌తో చేయాలి. ఇలా చేయడం వల్ల వామప్‌తో పాటు, అదనపు క్యాలరీలు కూడా కరుగుతాయి.
బర్పీస్ : బరువు తగ్గాలంటే బర్పీస్ తప్పనిసరి. మొదట్లో స్లోగా చేయాలి. తర్వాత స్పీడ్‌ను పెంచాలి. మొదట కొంచెం కష్టంగా అనిపించినా అలవాటైతే బరువు ఈజీగా తగ్గిపోతుంది. 40 సెకన్లకు ఒక బర్పీ తీయొచ్చు, 20 సెకన్ల బర్పీ తప్పనిసరి.
జంపింగ్ జాక్స్ : హెడ్ నుంచి ఫీట్ వరకూ మంచి ఎక్సర్సైజ్ కావాలంటే ‘జంపింగ్ జాక్స్’ చేయాలి. ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకునేవారు జంపింగ్ జాక్స్‌తో మొదలు పెట్టడం బెటర్. మజిల్ పవర్‌ను యాక్టివ్ చేయడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి చేయడం సింపుల్ అండ్ ఈజీ కూడా. 50 సెకన్లు తర్వాత పది సెకన్ల రెస్ట్ తీసుకోవాలి.
సూర్య నమస్కారాలు : సూర్య నమస్కారాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కసారి సూర్య నమస్కారాలు అలవాటైతే వీటి ఉపయోగం అర్థం అవుతుంది. శరీరంలోని ప్రతి పార్ట్ మీద అనుకూల ప్రభావాన్ని చూపుతాయి. మంచి వామప్‌ను ఇచ్చి హెల్త్‌ను కాపాడటమే కాదు, మజిల్స్ బలపడటానికి కూడా ఉపయోగపడతాయి.
లాంజ్ వాక్ : నడవడం అంటే చాలామందికి కష్టమే. కాళ్లు నొస్తాయి అనుకుంటారు. అదీ లాంజ్ వాక్ ( మోకాళ్లు నేలకు ఆనించి నడవడం) అంటే వామ్మో అంటారు. కానీ, ఇది కూడా ఒక ఎక్సర్సైజే. ఐదు నిమిషాలు లాంజ్ వాక్ చేస్తే బాడీకి మంచి ఎక్సర్సైజ్ దొరుకుతుంది. లోయర్ బాడీలోని ప్రతి భాగానికి ఇది ఎంతో ఉపయోగం.