రైలు టికెట్లు సులువుగా పొందే మార్గం ఇదే

రైలు టికెట్లు సులువుగా పొందే మార్గం ఇదే

IRCTC వెబ్ సైట్ ను అప్డేట్ చేసింది రైల్వే శాఖ… ఇప్పటి నుండి ఆన్ లైన్ లో ట్రైన్ టికెట్లను సులువుగా పొందడానికి వీలుగా వెబ్ సైట్ ను రూపొందించారు. దీంతో ప్రయాణీకులు గంటల తరబడి లైన్లో నిలబడి టికెట్లను పొందనవసరం లేదని రైల్వే అధికారులు అన్నారు. అయితే టికెట్స్ ను పొందేందుకు వెబ్ సైట్ ను ఎలా ఉపయోగించాలో కొన్ని సూచనలు ఇచ్చారు.

  1. IRCTC వెబ్ సైట్ లో అర్ధ రాత్రి 12.20 నుంచి.. రాత్రి 11.45 గంటల వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
  2. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్ట్, నెట్ బ్యాంకింగ్, పేటీఎమ్ వాలెట్ వంటి సర్వీసులతో కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
  3. IRCTC వెబ్ సైట్ ను ఉపయోగించే యూజర్లు ఆదార్ కార్డు ను ఎకౌంట్ తో గనుక జతపరిస్తే ప్రతీ నెల 12 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అదే.. ఆదార్ కార్డును  ఎకౌంట్ తో జతపరచక పోతె నెలకు 6టికెట్లను మాత్రమే పొందడానికి అవకాశం ఉంది.
  4. సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు, జర్నలిస్టులకు టికెట్ రేటుపై కన్సిషన్ ఇచ్చారు. ఇందుకు తగిన ఆధారాలను IRCTC వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి.
  5. టికెట్ పై ఉన్న పేరును గనుక మార్చుకోవలసి వస్తే.. బుకింగ్ కౌంటర్ వద్ద మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. వెబ్ సైట్ లో మార్చడం కుదరదు.
  6. రైలు టికెట్లను జెనరల్, లేడీస్, సీనియర్ సిటిజన్, దివ్యాంగులు, తాత్కాల్, ప్రీమియం తాత్కాల్ కోటాలలో పొందవచ్చు.
  7. ఒకవేల బుక్ అయిన టికెట్లను క్యాన్సిల్ చేసుకునేందుకు ‘బుకింగ్ టికెట్’ సెక్షన్ లోకి వెళ్లి చేసుకోవాలి. చెల్లించిన నగదు అకౌంట్ లోకి చేరుతుంది. క్యాన్సలేషన్ చార్జీలు వర్తిస్తాయి.
  8. ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్.. పాసింజర్ ఒరిజినల్ ID కి చేరుతుంది. PNR (passenger name record ) కు రైలు కు సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. ట్రైన్ టైమింగ్స్ తో పాటు దాని పొజీషన్ తెలుస్తాయి.