వీడియో: బరువు తగ్గడానికి ‘మలైకా’ ఫిట్‌నెస్ పాఠాలు

వీడియో: బరువు తగ్గడానికి ‘మలైకా’ ఫిట్‌నెస్ పాఠాలు

ముంబై: బాలీవుడ్‌ భామ, స్పెషల్ సాంగ్స్‌లో అదరగొట్టే మలైకా అరోరాకు ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం. 47 ఏళ్ల వయస్సులోనూ అద్భుతమైన ఫిజిక్‌తో కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతోంది మలైకా. బరువు తగ్గాలనుకునే వారు, ఫిట్‌నెస్ ఫ్రీక్స్ మలైకా యోగా వీడియోలను ఫాలో అవుతుంటారనే ఆమె క్రేజ్ ఏంటో తెలుస్తుంది. ఫిట్‌నెస్ ప్రేమికుల కోసం సర్వ, దివ్య యోగా పేరుతో యోగా ప్లాట్‌ఫామ్స్‌కు కో ఫౌండర్‌గా ఉన్న మలైకా చాలా కృషి చేస్తోంది. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయడమే తన ఫిట్‌నెస్, బ్యూటీ సీక్రెట్ అని అంటోందీ భామ. బరువు తగ్గాలనుకునే వారితోపాటు ఫిట్‌గా ఉండాలనుకునే వారికి మలైకా పలు టిప్స్ ఇచ్చింది. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడం, ఫిజికల్ ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకుంటే శారీరకంగా ఫిట్‌గా ఉండటంతోపాటు మానసికంగా దృఢంగా ఉంటామని చెప్పింది. అందుకోసం తినడం, కరిగించడం, నిద్రపోవడం (ఈట్, బర్న్, స్లీప్ అండ్ రిపీట్) అనే పద్ధతిని ఫాలో అవ్వమంటూ సూచించింది. అలాగే క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలని పేర్కొంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందని, దాన్ని కాపాడుకోవడంపై ధ్యాస పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.