బీజేపీని గెలిపించి.. కేసీఆర్ అహంకారం మీద దెబ్బకొట్టాలి

బీజేపీని గెలిపించి.. కేసీఆర్ అహంకారం మీద దెబ్బకొట్టాలి

తనకు ఎమ్మెల్యే పదవి తన తండ్రో, తల్లో ఇవ్వలేదని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో భాగంగా ఆయన కనిపర్తిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘కరోనా సమయంలో నేను పేషంట్ల మధ్య తిరిగితే.. కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్ లో కూర్చొని నన్ను ఖతం పట్టించిండు. ఇజ్జత్ లేని దగ్గర ఉండొద్దనే పార్టీకి రాజీనామా చేశాను.  సొంత పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను డబ్బులు పెట్టి కొన్నాడు. నేను టీఆర్ఎస్ లోకి మధ్యలో వచ్చి మధ్యలో పోలేదు. నీ పార్టీకి 20 ఏండ్ల చరిత్ర ఉంటే.. అందులో నా చరిత్ర 18 ఏండ్ల 6 నెలలు. నా రాజీనామా వల్లే హుజూరాబాద్‎లో దళితబంధు వచ్చింది. నాకు ఎమ్మెల్యే పదవి నా తల్లో, తండ్రో ఇవ్వలేదు. ఈ విషయంలో కేసీఆర్ సోయి తప్పిండు. మేం శ్రమను, చెమటను నమ్ముకున్నోళ్లం. మేం పైరవీలు చేసేటోళ్లం కాదు. కేసీఆర్ కలలో కూడా నన్నే తలుచుకుంటుండు. బీజేపీని గెలిపించి.. కేసీఆర్ అహంకారం మీద దెబ్బకొట్టాలి’ అని ఈటల రాజేందర్ అన్నారు.