గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు: బాలస్వామి

గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు: బాలస్వామి

హైదరాబాద్, వెలుగు: ప్రతిరోజూ గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చని నేషనల్ ఎగ్ అండ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్షుడు  బాలస్వామి అన్నారు. పౌల్ట్రీ రంగంలో 50 ఏళ్ల  సర్వీస్‌‌‌‌ను, 80వ జన్మదినాన్ని ఆయన జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లి పాల తర్వాత కల్తీ చేయలేని ఆహారం గుడ్డు మాత్రమేనని, అందువల్ల ప్రతి ఒక్కరూ రోజూ గుడ్లు తినాలని సూచించారు. 

గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటీస్, ఒబెసిటీ వంటి వ్యాధులను నివారించొచ్చని చెప్పారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అన్నారు. పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ, గుడ్లు, చికెన్ ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడంలో  బాలస్వామి కీలక పాత్ర పోషించారన్నారు.