జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థులకు గుర్తులివేే....

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థులకు గుర్తులివేే....

జూబ్లీహిల్స్ బైపోల్  బరిలో 58 మంది అభ్యర్థులు  ఉన్న సంగతి తెలిసిందే. ఈ సారి ఎన్నికల బ్యాలెట్ యూనిట్లలో అభ్యర్థుల కలర్ ఫోటోల ప్రింట్ చేయనుంది ఈసీ.  ఇవాళ  అక్టోబర్ 26న బరిలో ఉన్న 58 మంది అభ్యర్థులకు ఈసీ గుర్తులను కేటాయించింది. రిజిస్టర్ పార్టీల అభ్యర్థులకు చపాతీ రోలర్, రోడ్ రోలర్ గుర్తు అలాట్ చేసింది.

 అంబేద్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి రాజుకి రోడ్ రోలర్ గుర్తు కేటాయించగా.. అలయెన్స్ ఆఫ్ డెమో క్రటిక్ రిఫామ్స్ పార్టీ అభ్యర్థికి చపాతీ  రోలర్ గుర్తు కేటాయించింది. కారును పోలిన గుర్తులు చపాతీ రోలర్, రోడ్ రోలర్స్ సింబల్స్ తొలగించాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించింది. దీంతో బీఆర్ఎస్ కు కొత్త టెన్షన్ మొదలైనట్టే..

ఈసీ కేటాయించిన బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి(కమలం), రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ( హస్తం), మూడో స్థానంలో మాగంటి సునీత( కారు) ఉన్నారు. ఇక ఐదో నంబర్ లో సోప్ డిష్, 9వ నంబర్ లో చపాతీ రోలర్, 13 నంబర్ లో రోడ్ రోలర్, 21వ నంబర్ లో కెమెరా గుర్తులు ఉన్నాయి.

జూబ్లీహిల్స్ లో ప్రధాని పోటీ కాంగ్రెస్,బీఆర్ఎస్,బీజేపీ మధ్య ఉండనుంది.  ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుండగా..14 నకౌంటింగ్ జరగనుంది.