
జడ్పీలు, ఎంపీపీల అపాయింటెడ్ డేలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జులై 4న ఎంపీపీలు, జులై 5 నుంచి జిల్లా పరిషత్ లు మనుగడలోకి రాబోతున్నాయి. ఈ మేరకు బుధవారం ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. మొదటి సమావేశాలూ అవే తేదీల్లో ఉంటాయని అందులో పేర్కొన్నారు. ఆయా తేదీల నుంచి ఐదేళ్ల పాటు సభ్యులు పదవిలో ఉంటారు. పదవీ కాలం పూర్తి కాని ఖమ్మం, కొత్త గూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల జడ్పీ అపాయింటెడ్ డేను ఆగస్టు 7న ఈసీ ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేశారు. ఆగస్టు 6న ఖమ్మం, కొత్త గూడెం జిల్లాల్లోని అన్ని ఎంపీపీలు, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, మహబూబాబాద్ జిల్లాలో ని గార్ల బయ్యారం, నాగర్‌కర్నూలు, జడ్చర్ల ఎంపీపీల సమావేశం జరగనుంది.