హుజురాబాద్ పోలింగ్‌కు రెడీ.. మొత్తం 306 పోలింగ్ స్టేషన్లు

హుజురాబాద్ పోలింగ్‌కు రెడీ.. మొత్తం 306 పోలింగ్ స్టేషన్లు

హుజురాబాద్ బై పోల్ కు అంతా రెడీ అయ్యింది. రేపటి పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది EC. ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు అధికారులు. హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు వచ్చారు పోలింగ్ సిబ్బంది. నియోజకవర్గంలోని  5 మండలాల పరిధిలో 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 891 ఈవీఏంలు, 515 వీవీ ప్యాట్స్ సిద్దం చేశారు అధికారులు. 17వందల 50 మంది పోలింగ్ విధుల్లో ఉంటారు. 3 వేల 865 మంది పోలీస్ సిబ్బందితో పాటు 25 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాటు చేశారు. 

హుజురాబాద్ లో బుధవారం నుంచే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇవాళ, రేపు మద్యం షాపులు బంద్ ఉండనున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ జరగనుంది. 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు. రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తి అయిన ఉద్యోగులకే ఎలక్షన్ డ్యూటీ వేశామన్నారు అధికారులు. పోలింగ్ సామాగ్రితో సాయంత్రం వరకు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు సిబ్బంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 306 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంపిక చేశారు అధికారులు. 

హుజురాబాద్ బైపోల్ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్. ప్రజలు నోట్లకు అమ్ముడుపోకుండా.... స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు పెట్టామన్నారు. కంప్లైంట్స్ వస్తే వెంటనే స్పందించి స్పెషల్ టీమ్స్ ను పంపిస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ ఆర్వీ కర్ణన్. మరోవైపు కరోనా పేషెంట్లు ఉంటే సాయంత్రం 6 గంటల తర్వాత... పీపీఈ కిట్ అందించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చారు.