మరికొన్ని గంటల్లో హుజురాబాద్‌లో మూగబోనున్న మైక్‌లు

మరికొన్ని గంటల్లో హుజురాబాద్‌లో మూగబోనున్న మైక్‌లు

హుజురాబాద్ బైపోల్ క్యాంపెయిన్ ఫైనల్ స్టేట్ కు చేరింది.  బుధవారం సాయంత్రం ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ప్రచారంలో స్పీడు  పెంచాయి పార్టీలు. బైపోల్ షెడ్యూల్ కంటే ముందు నుంచే బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తించాయి. షెడ్యూల్ వచ్చిన తర్వాత క్యాంపెయిన్ మరింత జోరందుకుంది. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ కూడా ప్రచార బరిలో దిగింది. మూడు ప్రధాన పార్టీలు ప్రచార సభలు, ఆత్మీయ సమ్మేళనాలతో హోరెత్తించాయి. ప్రధాన పార్టీల నేతలు హుజురాబాద్ లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నాయి. 

కరోనా  నిబంధనల కారణంగా  72 గంటల ముందు ప్రచారాన్ని క్లోజ్ చేయాలని ఆదేశించింది ఈసీ. దీంతో  బుధవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత హుజురాబాద్ లో మైకులు మూగబోనున్నాయి. వేరే ప్రాంతాల నుంచి హుజురాబాద్ ప్రచారానికి వెళ్లిన నాన్ లోకల్ లీడర్లంతా ఖాళీ చేయనున్నారు. ఈ నెల 30 న హుజురాబాద్ బై పోల్ పోలింగ్ జరగనుంది. నవంబర్ 2 న ఓట్ల కౌంటింగ్ నిర్వహిస్తారు. 

ఈ నెల 30 న జరిగే పోలింగ్ లో ... ప్రధాన పార్టీల  అభ్యర్థులతో పాటు 30 మంది బరిలో ఉన్నారు. 2 లక్షల 36 వేలకు పైగా  ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ కోసం 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే బైపోల్ విధుల కోసం కేంద్ర బలగాలు దిగాయి.