ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మున్సిపల్ అధికారులు

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మున్సిపల్ అధికారులు

స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచుతూ మున్సిపల్ శాఖ జీవో జారీ చేయడంపై  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (EC) హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని  ఉల్లంఘించారని EC తెలిపింది. ఎన్నికల సమయంలో అధికారులు స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. మున్సిపల్ శాఖ స్పెషల్ చీప్ సెక్రటరీ అరవింద్ కుమార్, సెక్రటరీ సుదర్శన్ రెడ్డికి  హెచ్చరిక జారీ చేయాలని  సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించింది.  

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ZPTC,MPTCల గౌరవ వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత విమర్శలు రావడంతో జీవో వెనక్కి తీసుకుంది.