V6 News

EC ఎవరికీ అనుకూలంగా ఉండదు: ద్వివేది

EC ఎవరికీ అనుకూలంగా ఉండదు: ద్వివేది

ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా ఉండదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని… విధి నిర్వహణలో బాధ్యతగా ఉన్నామని, నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. సీనియర్‌ రాజకీయ నేతగా చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తాము అమలు చేస్తున్నామన్నారు.

ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ చంద్రబాబు.. ద్వివేదిని కలిసి వినతపత్రం అందజేశారు. ఆ తర్వాత ఈసీ కార్యాలయం ముందు భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ద్వివేది పై విధంగా వ్యాఖ్యానించారు.