
దేశంలోని నిరుపేదలకు కనీస ఆదాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించింది. అయితే ఆ పథకాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తప్పుపట్టారు. ఆ పథకం ఆర్థిక విధానాలకు సరిపోదని తన ట్విట్టర్‌లోనూ విమర్శించారు. అయితే ఓ రాజకీయ పార్టీ ప్రకటించిన పథకంపై.. ప్రభుత్వ అధికారి అయిన రాజీవ్ కుమార్ స్పందించడాన్ని ఎలక్షన్ కమిషన్ (EC) తప్పుపట్టింది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని రాజీవ్ కుమార్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. దేశంలోని పేదల్లో 20 శాతం మంది కుటుంబాలకు ప్రతి ఏడాది 72 వేల ఆదాయం వచ్చే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు రాహుల్ గాంధీ తన పార్టీ మేనిఫెస్టోలో తెలిపారు.