ఏపీ,తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ

 ఏపీ,తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ

కరోనా పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వివిధ ఎన్నికలు జరిగాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 9 స్థానాలకు నిర్వహించాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేసింది ఈసీ. మే 31తో ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీలకు, జూన్ 3తో తెలంగాణలోని 6గురు ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగియనుంది.

దీంతో ఆయా స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆ లేఖపై చర్చించిన ఈసీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని తెలిపింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతనే ఎన్నికల నిర్వహిస్తామని చెప్పింది.