రాష్ట్రానికి నిధులు అడిగినందుకే కక్ష

రాష్ట్రానికి నిధులు అడిగినందుకే కక్ష
  • సోరెన్ అనర్హతపై... ఇయ్యాల గవర్నర్ నిర్ణయం
  • సోరెన్ నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశం 
  • బెంగాల్ లేదా బీహార్ లో క్యాంపుల ఏర్పాటుపై చర్చ

అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్  సీఎం హేమంత్​ సోరెన్‌‌‌‌పై వ‌‌‌‌చ్చిన‌‌‌‌ ఆరోప‌‌‌‌ణ‌‌‌‌లు నిజ‌‌‌‌మ‌‌‌‌ని తేల్చిన ఈసీ .. ఆయ‌‌‌‌న శాస‌‌‌‌న‌‌‌‌సభ స‌‌‌‌భ్యత్వాన్ని ర‌‌‌‌ద్దు చేయాలని గ‌‌‌‌వర్నర్​కు లేఖ పంపింది. దీనిపై గవర్నర్​ శనివారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

రాంచీ:   జార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో సీఎం హేమంత్ ​సోరెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తేల్చిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ).. ఆయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న శాస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ్యత్వాన్ని ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్దు చేయాలని కోరుతూ శుక్రవారం జార్ఖండ్ గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్నర్ ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేశ్ బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ పంపింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ, హోంశాఖలను సంప్రదించిన తర్వాత 
గవర్నర్ శనివారం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, సోరెన్ పై అనర్హత వేటు ఖాయం కావడంతో జేఎంఎం, కాంగ్రెస్ తో కూడిన అధికార యూపీఏ అలర్ట్ అయింది. తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించేందుకు ప్రయత్నాలు షురూ చేసినట్లు చర్చ మొదలైంది.

సీఎం ఇంట్లో ఎమ్మెల్యేల భేటీ

రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం హేమంత్​సోరెన్ ​నివాసంలో 40 మంది ఎమ్మెల్యేలతో శుక్రవారం యూపీఏ కీలక సమావేశం జరిగింది. తమ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లకుండా కాపాడుకోవడం కోసం తమకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్న బెంగాల్ లేదా బీహార్ కు తరలించి రిసార్ట్​రాజకీయాలకు తెరలేపే అవకాశం ఉందని మీటింగ్​కు హాజరైన కొందరు నేతలు పేర్కొన్నారు. సాయంత్రం కూడా మరోసారి సీఎం ఇంట్లో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అయితే, అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలను లాక్కోవడం అంత ఈజీ కాదని, వారు రాంచీలోనే ఉంటారని రాష్ట్ర మంత్రి అలంగీర్ ఆలం చెప్పారు. జార్ఖండ్​కాంగ్రెస్​పాలిత రాష్ట్రంగా ఉండేందుకే ఇష్టపడుతామని, అధిష్టానం ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు మొదట పేర్కొనగా, సోరెనే సీఎంగా కొనసాగుతారని జేఎంఎం నేత వినోద్​పాండే స్పష్టం చేశారు. మొత్తం 82 స్థానాలున్న జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీలో జార్ఖండ్​ముక్తి మోర్చాకు 30, కాంగ్రెస్ కు17, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 


అనర్హత వేటు పడితే.. 

హేమంత్ సోరెన్ సభ్యత్వం రద్దయితే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సొంత పార్టీతోపాటు కాంగ్రెస్​ఎమ్మెల్యేల బలం ఎప్పటిలాగే ఉండి, వాళ్లంతా హేమంత్​నే కోరుకుంటే ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కేబినెట్ లోని మంత్రులంతా రాజీనామా చేసి, మళ్లీ మంత్రివర్గం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సోరెన్ ఆరు నెలల్లోపు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. మరోవైపు సభ్యత్వం రద్దు నిర్ణయాన్ని ఆయన కోర్టులో కూడా సవాలు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 

రాష్ట్రానికి నిధులు అడిగినందుకే కక్ష: సోరెన్ 

జార్ఖండ్ కు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 1.36 లక్షల కోట్ల బకాయిలను అడిగినందుకే కేంద్రం తనపై అన్ని దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని హేమంత్ సోరెన్ అన్నారు. ‘‘వారు నన్ను ఏమీ చేయలేరని తెలియడంతో.. వృద్ధాప్యంలో ఉన్న గురూజీ (శిబూ సోరెన్)ని వేధించేందుకు ప్రయత్నించడం ద్వారా నన్ను తమ దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు” అని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.