తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌‌కు పచ్చజెండా

తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌‌కు పచ్చజెండా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం సీఈఓ సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, స్థానాల మార్పు, పేర్ల సవరణలపై ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. 

తాజా మార్పులతో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,985 నుంచి 36,353కి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 460 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా.. 551 కేంద్రాల లోకేషన్లను మార్చారు. మరో 335 సెంటర్ల పేర్లను సవరించగా, 92 పోలింగ్ కేంద్రాలను తొలగించడం లేదా వేరే దాంట్లో మెర్జ్ చేశారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 4,094, రంగారెడ్డిలో 3,469, మేడ్చల్-మల్కాజిగిరిలో 2,442 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. పాత, కొత్త కేంద్రాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఈసీ ఆదేశించింది.