త్వరలో దేశవ్యాప్తంగా సర్.. ఫస్ట్ ఫేజ్లో 10 రాష్ట్రాల ఓటర్ లిస్ట్ సవరణ

త్వరలో దేశవ్యాప్తంగా సర్.. ఫస్ట్ ఫేజ్లో 10 రాష్ట్రాల ఓటర్ లిస్ట్ సవరణ
  • నేడు తేదీని ప్రకటించనున్న ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ:  త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాపై స్పెషల్  ఇంటెన్సివ్  రివిజన్ (సర్) అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం సోమవారం తేదీని ప్రకటించనుంది. ఫస్ట్ ఫేజ్​లో 10 రాష్ట్రాల్లో సర్ ను అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే వెస్ట్ బెంగాల్, తమిళనాడుతో పాటు అస్సాం, కేరళ, పుదుచ్చేరి మొదటి దశ జాబితాలో ఉన్నాయి. కాగా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్  ఎలక్టోరల్  ఆఫీసర్లతో ఎన్నికల సంఘం ఇటీవలే ఢిల్లీలో మీటింగ్  నిర్వహించింది. బిహార్ లో చేపట్టిన ఓటర్ల సవరణ జాబితా గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఇదే ప్రక్రియను త్వరలోనే దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించారు. ‘

‘బిహార్ లో ఈ సంవత్సరం జూన్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు సర్  ప్రక్రియ చేపట్టాం. ఇందుకు మూడు నెలలపైనే సమయం పట్టింది. త్వరలో దేశవ్యాప్తంగా నిర్వహించే సర్ కు అంతకన్నా తక్కువ టైం తీసుకోవాలని డిసైడ్  చేశాం. అంతేకాకుండా వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత ఓటర్ల జాబితాను కొత్త ఓటర్ల జాబితాతో ముందుగానే మ్యాచ్  చేయాలని చీఫ్​ ఎలక్టోరల్  ఆఫీసర్లను ఆదేశించాం” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి ఓ టీవీ చానెల్ కు తెలిపారు.