కాలుష్యం కొంతైన తగ్గుతుంది: ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉబెర్ గ్రీన్ EV సేవలు

కాలుష్యం కొంతైన తగ్గుతుంది: ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉబెర్ గ్రీన్ EV సేవలు

పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రికల్ వెహికల్ (EV) ఉబెర్ గ్రీన్ (Uber Green ) ఇప్పుడు ఢిల్లీలో కూడా అందుబాటులోకి వచ్చింది.భారతదేశంలో అగ్రగ్రామి ట్యాక్సీ సర్వీస్ గా స్థిరపడిన ఉబెర్ తన సేవలను తాజా దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు  ఇప్పటికే బెంగుళూరు, ముంబై నగరాల్లో ఇప్పటికే అనేకమంది రైడర్లు ఈ ఉబెర్ గ్రీన్ ఎలక్ట్రిక వాహనాల సేవలను వినియోగించుకుంటున్నారు.  త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 

ఉబెర్ ఇండియా, దక్షిణాసియాలోని సెంటర్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ మాట్లాడుతూ భవిష్యత్ లో రవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రాధాన్యత పెరుగుతుందని  అన్నారు. 2040 నాటికి భారతదేశంలోను అటు ప్రపంచవ్యాప్తంగా జీరో ఎమిషన్ ఫ్లాట్ ఫామ్ గా మార్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. 

దేశవ్యాప్తంగా 125 నగరాల్లో ఉబెర్ సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 8 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.