రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్.. కాసేపట్లో వైద్య పరీక్షలు

రాత్రంతా ఈడీ ఆఫీసులోనే  కేజ్రీవాల్.. కాసేపట్లో వైద్య పరీక్షలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన అప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ను కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు డాక్టర్లు. ఉదయం 11 గంటల తర్వాత రౌస్ అవెన్యు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. రాత్రి ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ ను తరలించిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. రాత్రంతా ఆయన ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. ఈ కేసులో ఇవాళ పలు పరిణామాలు జరగనున్నాయి. స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట హాజరుపర్చనున్నారు ఈడీ అధికారులు. 

10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది ఈడీ. దీంతో ఈడీ కార్యాలయం, రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ దగ్గర  భారీ భద్రత కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది ఢిల్లీ పోలీసు యంత్రాంగం. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే రాత్రి నుంచి పలు సిటీల్లో ఆందోళనకు దిగారు ఆప్ నాయకులు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ నిన్న అరెస్ట్ చేసింది. రాత్రి భారీభద్రత బలగాలతో ఆయన ఇంటికి చేరుకున్నారు. సెర్చ్ వారంట్ చూపించి ఆయన్ను కొంతసేపు ప్రశ్నించారు. తర్వాత అరెస్ట్ చేసి, ఈడీ ఆఫీసుకు తరలించారు. పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు.