
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. హవాలా లావాదేవీలకు సంబంధించి ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. కోల్ కత్తాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన 4.81కోట్ల విలువైన స్థిరాస్థులను ఈడీ గత ఏప్రిల్ లోనే జప్తు చేసింది. సత్యేంద్రజైన్ పై 2017లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
కాగా సత్యేంద్ర జైన్ ను రాబోయే కొద్ది రోజుల్లో ఈడీ అరెస్ట్ చేస్తుందని జనవరిలో కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్ ఎన్నికల ముందు ఆయన చెప్పిన ఈ మాటలు ఇవాళ నిజమయ్యాయి. అయితే కేంద్రం అక్రమంగా అరెస్ట్ చేసినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవని ఆయన వ్యాఖ్యానించారు. ఇక సత్యేంద్ర జైన్ కూడా అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నట్లు అప్పట్లో ప్రకటించారు.
ED arrests Delhi Health Minister Satyendar Jain in money laundering case
— ANI Digital (@ani_digital) May 30, 2022
Read @ANI Story | https://t.co/evgLiCivka#SatyendarJain #ED #moneylaundering pic.twitter.com/shqG9lycvB
మరిన్ని వార్తల కోసం
దేశాన్ని అమెరికాకు అమ్మింది సోనియానే !!