మనీ లాండరింగ్ కేసులో జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ అరెస్ట్

మనీ లాండరింగ్ కేసులో జెట్ ఎయిర్ వేస్  ఫౌండర్ నరేష్ గోయల్ అరెస్ట్

మనీ లాండరింగ్ కేసులో జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ముంబైలోని కేంద్ర ఏజెన్సీ కార్యాలయంలో గంటల తరబడి ప్రశ్నించిన తర్వాత గోయల్ ను మనీలాండరింగ్ నిరోదధక చట్టం (పీఎం ఎల్ ఎ) కింద ఈడీ అదుపులోకి తీసుకుంది. ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అయితే నరేష్ గోయల్ ను ఈడీ కస్టడీకి కోరే అవకాశం ఉంది. కెనరా బ్యాంక్ నుంచి రూ. 539 కోట్ల రుణాలను ఎగవేసిన ఆరోపణలతో జెట్ ఎయిర్ లైన్స్ పై విచారణ ఈడీ జరుగుతోంది. 

2023 మేలో మనీలాండరింగ్ కేసులో ఈడీ కేసు నమోదు చేసింది. జెట్ ఎయిర్ వేస్ రూ.848.86 కోట్ల రుణం తీసుకొని అందులో రూ. 538 కోట్ల రుణ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ బ్యాంకు ఫిర్యాదుపై ఎఫ్ ఐఆర్ నమోదు అయింది. అంతకుముందు 2022 నవంబర్ లో నరేష్ గోయల్, అతని భార్య అనిత, గౌరంగ్ శెట్టిలతో ఉద్యోగులపై మోసం, నేరపూరిత సహకారం, దుష్ప్రవర్తనపై బ్యాంక్ ఫిర్యాదు చేసింది. 2023 మేలో సీబీఐ కేసు నమోదు చేసింది. JIL అనుబంధ సంస్థ JLL సంస్థ కోసం నిధులను రుణాలు , అడ్వా న్సులు, పెట్టుబడుల రూపంలో మళ్లించిందని పేర్కొంది.