సుజనా గ్రూప్ కు ఈడి షాక్.. 315 కోట్ల ఆస్తులు అటాచ్

సుజనా గ్రూప్ కు ఈడి షాక్.. 315 కోట్ల ఆస్తులు అటాచ్

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భారీ షాకిచ్చిం ది. బ్యాం క్‌ ఫ్రాడ్‌ కేసు లో హైదరాబాద్‌ లోని వైస్రాయ్‌ హోటల్ స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌ కు చెం దిన రూ. 315 కోట్ల ఆస్తులను మంగళవారం అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. సుజనా షెల్ కంపెనీలు సృష్టించి నకిలీ ఆస్తులు, బోగస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. సుజనా గ్రూప్ కు చెందిన బెస్ట్ అండ్  ప్టన్ ఇంజనీరిం గ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) పేరిట నకిలీ ఆస్తులు చూపి 2010 నుంచి 2013మధ్య సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఆంధ్రా బ్యాం కు, కార్పొరేషన్ బ్యాంకుల నుంచి రూ.364 కోట్ల రుణం తీసుకుంది.మోసపోయమని బ్యాంకులు గగ్గోలు పెట్టడంతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిం ది. తర్వాత
కేసు ఈడీకి వచ్చింది. సుజనా గ్రూప్ సంస్థలు,సుజనా ఆస్తులపై ఈడీ సోదా లు చేసి పంజాగుట్ట నాగార్జు న హిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సుజనా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్ నుంచి కీలక పత్రాలు, షెల్ కంపెనీలు, 124 నకిలీ రబ్బరు స్టాం పులను స్వాధీనం చేసుకుంది. లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు, అటూ ఇటూ తిప్పి చివరకు వైస్రాయ్‌ కు మళ్లించినట్లు దర్యాప్తు లో తేలింది. దీంతో హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్తులను అటాచ్ చేసింది.