పార్టీ ఫండ్స్ ​పేరుతో రూ.200 కోట్లు కాజేసిండు

పార్టీ  ఫండ్స్ ​పేరుతో రూ.200 కోట్లు కాజేసిండు

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్​ కేసులో బాలీవుడ్​ యాక్టర్ ​జాక్వెలిన్ ​ఫెర్నాండెజ్​ను ఎన్​ఫోర్స్​మెంట్​డైరెక్టరేట్(ఈడీ) నిందితురాలిగా చేర్చింది. ఈ కేసులో ఢిల్లీలోని ప్రివెన్షన్​ఆఫ్​మనీ లాండరింగ్​యాక్ట్ (పీఎంఎల్ఏ) స్పెషల్​ కోర్టులో కొత్త చార్జిషీట్​ను ఈడీ ఫైల్​చేసింది. ఆ చార్జిషీట్​లో జాక్వెలిన్​ను నిందితురాలిగా చేర్చామని ఈడీ వర్గాలు తెలిపాయి.​ మనీ లాండరింగ్​ కేసులో ఈడీ ఆమెను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. అలాగే ఏప్రిల్​లో పీఎంఎల్ఏ కింద ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల ఫండ్స్​ను అటాచ్​చేసింది. ‘‘ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్​ చంద్రశేఖర్ ​దోపిడి, మోసం వంటి వివిధ నేరాలకు పాల్పడడం ద్వారా సంపాదించిన డబ్బుతో జాక్వెలిన్​కు రూ.5.71 కోట్ల విలువైన గిఫ్ట్​లు ఇచ్చాడు.

ఈ గిఫ్ట్​లను తన సన్నిహితురాలు పింకీ ఇరానీతో ఆమెకు డెలివరీ చేయించాడు. అంతేకాకుండా ఈ కేసులో నిందితుడు, హవాలా ఆపరేటర్ అవతార్ ​సింగ్ ​కొచ్చార్​తో జాక్వెలిన్ ​ఫ్యామిలీ మెంబర్లకు రూ.1.3 కోట్ల నిధులు, రూ.14 లక్షల విలువైన కారును కూడా సుకేశ్ ​ఇప్పించాడు. అలాగే వెబ్ ​సిరీస్ ​ప్రాజెక్టు కోసం స్ర్కిప్ట్​ రాయడానికి జాక్వెలిన్​ తరపున ఓ రైటర్​కు సుకేశ్​రూ.15 లక్షలు అందించాడు.  ఫోర్టిస్ ​హెల్త్​కేర్ ​ప్రమోటర్ ​శివిందర్ ​మోహన్ ​సింగ్ ​భార్య అదితి సింగ్ ​వంటి హైప్రొఫైల్​ వ్యక్తులను మోసం చేయడం ద్వారా సుకేశ్​ ఆ డబ్బు సంపాదించాడు. పార్టీ పేరిట ఫండ్స్ ​పేరుతో వారి నుంచి రూ.200 కోట్లు కాజేసిండు” అని ఈడీ ఆఫీసర్లు పేర్కొన్నారు. సుకేశ్​ తనకిచ్చిన గిఫ్ట్​లు నేరాలకు పాల్పడడం ద్వారా వచ్చినవేనన్న విషయం జాక్వెలిన్​కు తెలుసన్నారు. 

ప్రియమైన నేను..

ఈడీ తనను నిందితురాలిగా చేర్చిన తర్వాత జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ఇన్​స్టాగ్రాం అకౌంట్​లో స్పందించారు. ‘‘డియర్​ మి.. నాకంతా మంచే జరుగుతది. నేను పవర్​ఫుల్ ​వ్యక్తిని. నా లక్ష్యాలు, కలల్ని అందుకుంట. ఆ సామర్థ్యం నాలో ఉంది. అంతా సర్దుకుంటది” అని జాక్వెలిన్ ​ పోస్టు చేశారు.