రెండోరోజు పైలట్ రోహిత్ రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ

రెండోరోజు పైలట్ రోహిత్ రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ

రెండో రోజు  టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు 7 గంటల పాటు రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. అయితే ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ రెడ్డి.. తనను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనే విచారిస్తున్నట్లు ఈడీ క్లారిటీ ఇచ్చిందన్నారు. కేవలం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనే ఈడీ  వివరంగా  ప్రశ్నలు అడిగిందని.. తాను కూడా విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పారు.

తన వ్యక్తిగత వివరాలు, ఫ్యామిలీ, విదేశీ టూర్లు, ఆస్తులు, వ్యాపారాల వివరాలను ఈడీ అధికారులు అడిగారని రోహిత్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తనను ఈడీ ఎందుకు విచారిస్తుందో తనకు  అర్థం కావడం లేదన్నారు.  తనను మళ్లీ ఈ నెల 27న విచారణకు రావాలని ఈడీ చెప్పిందన్నారు. మిగతా విషయాలు రేపు వెల్లడిస్తానని రోహిత్ రెడ్డి చెప్పారు.