కవిత అరెస్ట్కి రౌస్ అవెన్యూ కోర్టు వారెంట్

కవిత అరెస్ట్కి రౌస్ అవెన్యూ కోర్టు వారెంట్

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన అరెస్ట్  నోటీసులు బయటికి వచ్చాయి. మనీలాండరింగ్  చట్టం 2022(15 of2023) కింద రౌస్ అవెన్యూ కోర్టు వారెంట్ ను జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించిన ఆమె మనీలాండరింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. శుక్రవారం (మార్చి 15) మధ్యాహ్నం నుంచి ఈడీ, ఇన్కమ్ టాక్స్ అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రాత్రి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తరలించనున్నారు.  ఇందుకోసం ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేశారు ఈడీ అధికారులు.  మరోవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కవితను ఢిల్లీ కి తరలిస్తున్నందున న్యాయవాదులతో కలిసి కేటీఆర్ , హరీష్ రావు ఢిల్లీ వెళ్లనున్నారు.