సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు ..అరెస్ట్ అంటూ ప్రచారం..!

సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు ..అరెస్ట్ అంటూ ప్రచారం..!

దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్. సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం లేకపోలేదు.. ముందస్తు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటీషన్ ను తిరస్కరించింది హైకోర్టు. ఈ ఆర్డర్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే.. సీఎం కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. ఇంట్లోనే విచారణ చేస్తున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. అదే విధంగా ఈడీ ఆఫీస్ దగ్గర కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. 

ఈడీ అధికారుల ఏర్పాట్లతో.. సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై ఈడీ అధికారులు.. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కొంత మంది అధికారులు.. పెద్ద పెద్ద ఫైల్స్ తో కేజ్రీవాల్ ఇంట్లోకి వెళ్లటం కనిపించింది. విషయం తెలిసిన వెంటనే.. ఆప్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేజ్రీవాల్ ఇంటికి తరలి వస్తున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది కేజ్రీవాల్ ఇంటి దగ్గర.

ALSO READ :- బీజేపీ మూడో జాబితా..చెన్నై సౌత్ నుంచి తమిళి సై