కేటీఆర్ పై ఈడీ కంప్లయింట్ రాలేదు : బంజారాహిల్స్ పోలీసులు

కేటీఆర్ పై ఈడీ కంప్లయింట్ రాలేదు : బంజారాహిల్స్ పోలీసులు

లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ అధికారులతో  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్‌ వారంట్‌ లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ ఈడీ అధికారులను కేటీఆర్ నిలదీశారు.  పలు అంశాలపై ఈడీ అధికారిణి భానుప్రియ మీనాను ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో  కేటీఆర్ పై ఈడీ మహిళా అధికారిణి భాను ప్రియా మీనా కంప్లైంట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. 

కానీ  బంజారాహిల్స్ పోలీసులు మాత్రం ఈడీ అధికారుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అంటున్నారు.  ఈడీ మహిళా అధికారి భాను ప్రియా మీనా ఏలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని తెలిపారు.   కాగా లిక్కర్ స్కామ్ కేసులో  మార్చి 15 వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ఏదైనా కేసులో నిందితుడి మీద ఒక రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ నమోదు చేస్తే.. అతడు వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు అరెస్ట్‌ చేసి, కేసు నమోదైన రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు తప్పనిసరిగా స్థానిక కోర్టు అనుమతి తీసుకోవాలి. దాన్నే ట్రాన్సిట్‌ రిమాండ్‌ ఆర్డర్‌ అని అంటారు.