
హైదరాబాద్ నగరంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. తార్నాకలోని రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్ ఫరూక్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రైల్వే లో నకిలీ బిల్లులతో వంద కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నారు. కాంట్రాక్టర్ ఫరూక్ ఇంజనీరింగ్ కంపెనీ నడుపుతున్నారు.
ఈడీ అధికారుల తనిఖీల్లో కీలకమైన డాక్యుమెంట్లు, లాప్ టాప్ సీజ్ చేసినట్లు సమాచారం. సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్ ఫరూక్ కు నకిలీ బిల్లుల చెల్లింపులో.. సహకరించిన రైల్వే అధికారుల గురించి కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారులెవరూ నోరు మెదపడం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.