లిక్కర్ కేసు: కవిత ఆడపడచు ఇంట్లో ఈడీ సోదాలు

లిక్కర్ కేసు: కవిత ఆడపడచు ఇంట్లో ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  అరెస్టైన కేజీవాల్. కవిత బంధువులు, అనుచరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు . కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లపైనా రైడ్స్ జరుగుతున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె భర్తకూ నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే కవిత, అనిల్ బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీలోని ఆప్ MLA గులాబ్ సింగ్ ఇంటిపై రైడ్స్ జరుగుతున్నాయి.