Liquor scam:రెండో ఛార్జ్ షీట్లో తెలంగాణ లీడర్ల పేర్లు..టెన్షన్ టెన్షన్.!

Liquor scam:రెండో ఛార్జ్ షీట్లో తెలంగాణ లీడర్ల పేర్లు..టెన్షన్ టెన్షన్.!

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీబీఐ కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తాజాగా సమర్పించిన ఛార్జ్ షీట్లో పలు కీలక అంశాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో ఏ1గా ఉన్న మనీష్ సిసోడియా పేరును ఈడీ మొదటి ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. ఈ క్రమంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో పలువురు తెలంగాణకు చెందిన రాజకీయ నేతల పేర్లు చేర్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

సీబీఐ కోర్టుకు ఈడీ సమర్పించిన తొలి ఛార్జ్ షీటులో సమీర్ మహేంద్రు పేరును చేర్చింది. ఆయనకు సంబంధించిన నాలుగు కంపెనీల పేర్లు అందులో ప్రస్తావించింది.  తొలి ఛార్జ్ షీట్లో 28సార్లు ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ ప్రస్తావించింది. గతంలో లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ గురించి ఈడీ ప్రస్తావించింది. ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరాలను ఈడీ అరెస్ట్ చేసింది.