జార్ఖండ్ సీఎంకు ఈడీ సమన్లు

జార్ఖండ్ సీఎంకు ఈడీ సమన్లు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మైనింగ్ లీజు లావాదేవీల్లో మనీ లాండరింగ్ కు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నవంబర్ 3న రాంచీలోని ఈడీ ఆఫీసులకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సీఎం రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి సన్నిహితుల అరెస్ట్ అనంతరం జులై నెలలో ఈడీ జార్ఖండ్వ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా మిశ్రా బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.11.88కోట్లు, ఇంట్లో 5.34కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  సోరెన్ నియోజకవర్గమైన బర్హైత్ లో మైనింగ్ వ్యాపారాన్ని మిశ్రా నియంత్రిస్తున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది.  మైనింగ్ లీజుల వ్యవహారంలో సీఎం హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిపై అనర్హత వేటు వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ కొన్ని నెలల క్రితమే ఫిర్యాదు కూడా చేసింది.